Ram Charan | గౌరవ డాక్టరేట్ అందుకున్న గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్

-

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan) గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో భాగంగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు డీజీ సీతారాం చేతుల మీదుగా డాక్టరేట్ ప్రదానం స్వీకరించారు. ఇకపై రామ్ చరణ్‌ కాస్త డాక్టర్ రామ్ చరణ్‌గా మారారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో తమ అభిమాన నటుడికి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. తండ్రికి తగ్గ వారసులు అని మెచ్చుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

- Advertisement -

కాగా RRR మూవీతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్(Ram Charan) మరో ఖ్యాతిని అందుకున్నారు. చిన్న వయస్సులోనే గౌరవ డాక్టరేట్ అందుకొని అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ‘గేమ్‌ ఛేంజర్’ మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 80శాతం పూర్తి అయింది. ఈ ఏడాదిలోనే మూవీని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో పాటు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలోనూ, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలోనూ హీరోగా చేయనున్నారు. తక్కువ కాలంలోనే మూడు సినిమాలతో అభిమానులను అలరించనున్నారు.

Read Also: తండ్రి అయిన మంచు మనోజ్.. పండంటి పాపకు జన్మనిచ్చిన మౌనిక..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Janasena | జనసేనకు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై ఈసీ కీలక ఆదేశాలు..

ఎన్నికల వేళ జనసేన(Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త అందించింది....

Nomination Withdrawal | తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

Nomination Withdrawal | తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిది....