ఏపీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విశాఖ(Vizag) నగరంలోని గోపాలపట్నంలో ఆందోళనకర పరిస్థితులు నొలకొన్నాయి. భారీ వర్షాల కారణంగా గొపాలపట్నంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. రామకృష్ణనగర్ కాళీమాత గుడి దారిలో కొండచరియలు(Landslide) విరిగిపడ్డాయి. పలు ఇళ్ల ప్రమాదపుటంచున ఉన్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడి పరిస్థితుల గురించి ఎమ్మెల్యే గణపతి బాబు.. అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే అక్కడ సహాయక చర్యలు చేపట్టాలని, కొండచరియలు విరిగిపడుతున్న ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కొండచరియలు విరిగిపడుతున్న క్రమంలో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Vizag | కొండచరియలు విరిగి ప్రాంతాల్లో పరిస్థితులను అంచనా వేయాలని, ఎన్ని ఇళ్లు ప్రమాదంలో ఉన్నాయో అంచనా వేసి ఆ ఇళ్లలో నివాసం ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయించి సుక్షిత ప్రాంతాలకు తరలించాలని ఎమ్మెల్యే గణపతి బాబు ఆదేశించారు. ఈ క్రమంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని జీవీఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గోపాలపట్నంలో చాలా ఇళ్లు కొండవాలు ప్రాంతంలోనే ఉంటాయి. కొండవదిగున భారీ సంఖ్యలో ఇళ్లు ఉన్నాయి. దీంతో అక్కడి చేపట్టాల్సిన పనులపై అధికారులు ఆలోచనలో పడ్డారు. ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యేవారు.