దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు (Loksabha Elections 2024) కు నగారా మోగింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుండగా.. తుది విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. ఇక నాలుగో విడతలో భాగంగా మే 13న ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. మేవ తేదీన మూడో దశ, మే 13న నాలుగో దశ, మే 20న ఐదో దశ, మే 25న ఆరో దశ పోలింగ్ నిర్వహించనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి మొత్తం ఫలితాలను వెల్లడించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్..
నోటిఫికేషన్: 18 మార్చి, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: 25 ఏప్రిల్
నామినేషన్ల పరిశీలన: 26 ఏప్రిల్
ఉపసంహరణకు ఆఖరు తేదీ: 29 ఏప్రిల్
పోలింగ్ తేదీ: మే 13
ఓట్ల లెక్కింపు: జూన్ 4