Jayaprakash Narayana | ఏపీలో గూండా రాజ్యం.. జగన్‌ పాలనపై జేపీ సంచలన వ్యాఖ్యలు.. 

-

లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ (Jayaprakash Narayan) వైసీపీ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్ పాలనను తీవ్రంగా ఎండగట్టారు.

- Advertisement -

“ఏపీలో తుగ్లక్‌ రాజ్యం ఒక పక్కన… నువ్వు ఏం చేసినా అడ్డుకుంటా. బస్తీ మే సవాల్‌ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగమే రాజధానిని ఆపేయడం కావచ్చు. గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీని ఆపేయడం కావచ్చు. పోలవరం ఆపేయడం కావచ్చు. ఎన్ని మాటలు చెప్పినా పోలవరం బ్రహ్మాండంగా జరగడం లేదు. పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు వచ్చినా, రాకపోయనా.. బోడి వచ్చేది ఏంటి అన్న భావనలో ఇక్కడ నేతలు ఉన్నారు” అంటూ జేపీ(Jayaprakash Narayan) విమర్శించారు.

“చంద్రబాబు, కేసీఆర్‌, రేవంత్‌ హయాంలో ప్రత్యర్థి తలకాయ తీసేయాలన్న పరిస్థితి లేదు. ఎక్కడో చోట గీత ఆ నేతలకు ఉంది. కానీ ప్రస్తుతం ఏపీలో ప్రస్తుత నేతలు కచ్చితంగా ఆ గీత దాటి వ్యవహరిస్తున్నారు. కనీస మర్యాద పాటించడం లేదంటూ ఇక్కడ ఒక గూండా రాజ్యం తెస్తున్నారన్న భావనను కలిగించారు” అంటూ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో జేపీ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. టీడీపీ-జనసేన క్యాడర్ జేపీ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

Read Also: ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ట్రైలర్‌ విడుదల.. హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్ సీక్వెన్స్‌.. 
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...