ఎన్నికల వేళ వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. సీఎం జగన్ ఆప్తుడు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి(Vallabhaneni Balashowry) పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. త్వరలోనే టీడీపీ(TDP)-జనసేన(Janasena) కూటమిలో చేరనున్నారని తెలుస్తోంది. మచిలీపట్నం(Machilipatnam) నుంచి ఎంపీగా మాజీ మంత్రి పేర్ని నానిని బరిలోకి దింపాలని కూడా సీఎం జగన్ ఆలోచిస్తున్నారట. అందుకే పార్టీ నుంచి పొమ్మనలేక పొగబెట్టారనే చర్చ నియోజకవర్గంలో జోరుగా జరుగుతోంది. కాగా పేర్ని నాని-బాలశౌరి మధ్య గత కొంతకాలంగా విభేదాలు నెలకొన్నాయి.
మరోవైపు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసాథి(Kolusu Parthasarathy), తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి(Rakshana Nidhi) కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇలా వరుసగా ముఖ్యమైన నేతలందరూ పార్టీకి రాజీనామా చేస్తుండటంతో వైసీపీ క్యాడర్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది.
Read Also: సీఎంగా పవన్ రెండున్నరేళ్లు పనిచేయాలి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat