రేపు ఈడీ విచారణకు వైసీపీ ఎంపీ మాగుంట

-

ఢిల్లీ లిక్కర్ కేసులో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి(Magunta Sreenivasulu Reddy)కి ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఈడీ నోటీసులు పంపించింది. లిక్కర్ స్కామ్‌(Delhi Liquor Scam)పై మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఈనెల 18న ఈడీ(ED) విచారణకు ఎంపీ మాగుంట గైర్హాజరైయ్యారు. కుటుంబ సభ్యుల్లో ఒకరి అనారోగ్య పరిస్థితి బాగాలేకపోవడం వల్ల విచారణకు రావడం లేదని మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన న్యాయమూర్తుల ద్వారా ఈడీ అధికారులకు సమాచారం పంపించారు. దీంతో, ఆయన రిక్వెస్టు మేరకు ఈడీ మరోతేదీని సూచించింది. రేపు(మార్చి 21) విచారణకు హాజరుకావాలంటూ మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. తమ కస్టడీలో ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్ళైతో కన్‌ఫ్రంటేషన్ విధానంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి(Magunta Sreenivasulu Reddy)ని ప్రశ్నించాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు.

- Advertisement -
Read Also: సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురి ఇంట్లో వజ్రాభరణాలు మాయం!

Follow us on: Google News  Koo

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...