సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురి ఇంట్లో వజ్రాభరణాలు మాయం!

Aishwaryaa Rajinikanth

Aishwaryaa Rajinikanth |సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. భాషలతో సంబంధం లేకుండా భారతదేశ వ్యాప్తంగా ఆయన సినిమాలు అదరగొడుతుంటాయి. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయనకు వీరాభిమానులు ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి సూపర్ ఫ్యామిలీలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ జరిగింది.

చెన్నైలోని ఆమె నివాసం నుంచి 48 తులాల వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు ఐశ్వర్య రజనీకాంత్ తెయాన్ మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాకర్‌లో పెట్టిన ఆభరణాలు కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2019లో తన సోదరి సౌందర్య వివాహ వేడుకలో ఈ ఆభరణాలు ధరించినట్టు తెలిపారు. ఆ తర్వాత నుంచి బయటకు తీయలేదని చెప్పారు. తన లాకర్‌లో ఆభరణాలు ఉన్నట్లు కొంతమంది పనివారికి మాత్రమే తెలుసని తెలిపారు. ఐశ్వర్య రజనీకాంత్(Aishwaryaa Rajinikanth) ఫిర్యాదుతో సెక్షన్ 381 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.

Read Also: ఓటమిని తట్టుకోలేక శ్రీలంక కెప్టెన్ సంచలన నిర్ణయం

Follow us on: Google News  Koo

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here