అనిల్‌కు మంత్రి పదవి రావడానికి అదొక్కటే కారణం: మేకపాటి

-

Mekapati Chandrasekhar Reddy |ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. తాజాగా.. వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను బహిష్కరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంలో వైసీపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ యాదవ్ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఆ ముగ్గురు నెల్లూరు జిల్లాలో ఓడిపోవడం ఖాయం అంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్(Anil Kumar Yadav) సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల గురించి కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆయన కోటంరెడ్డిని టార్గెట్ చేద్దామనుకున్నారు, కానీ మేకపాటి(Mekapati Chandrasekhar Reddy) రియాక్ట్ అయ్యారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ అనిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనిల్ సింగిల్ డిజిట్ మెజార్టీ ఎమ్మెల్యే అని ఎద్దేవా చేశారు. నోరు ఉంది కాబట్టే ఆయనకు జగన్ మంత్రి పదవి ఇచ్చారని చెప్పుకొచ్చారు. నెల్లూరు అంతా అనిల్ గురించే మాట్లాడుకుంటున్నారని, ఆయన ఓడిపోతారని అనుకుంటున్నారని మేకపాటి సెటైర్లు వేశారు.

- Advertisement -
Read Also: తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...