ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్(Minister Adimulapu Suresh) కు తృటిలో ప్రమాదం తప్పింది. G20 సన్నాహక సమావేశాలకు స్వాగతం పలుకుతూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే.. ఆదివారం విశాఖ ఆర్కే బీచ్‌లో పారా గ్లైడింగ్ చేస్తుండగా టేకాఫ్ సమయంలో ఇంజిన్ ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. గాలివాటం సరిగా లేకపోవడంతో వన్ సైడ్‌కి ఒరిగిపోయింది. దీంతో మంత్రికి వ్యక్తిగతమైన సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో మంత్రి సురేష్(Minister Adimulapu Suresh) ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇలా ఒక్కసారిగా క్షణాల్లో జరిగిపోవడంతో అక్కడున్న ఇతర మంత్రులు షాక్‌కుగురయ్యారు. మంత్రికి ఎలాంటి అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విశాఖపట్నం ఆర్కే బీచ్ లో పారా గ్లైడింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో మంత్రులు అమర్ నాథ్, విడదుల రజిని, విశాఖ కలెక్టర్, మేయర్ కూడా అక్కడే ఉన్నారు.
Read Also: TTD ఈవో ధర్మారెడ్డిపై సీఎం జగన్‌కు ఫిర్యాదు చేస్తా: MLA
Follow us on: Google News, Koo, Twitter