విజయవాడ(Vijayawada)లో చేపడుతున్న సహాయక చర్యలను మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) పరిశీలించారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్‌లో ఆయన ఈరోజు పర్యటించారు. అక్కడి పరిస్థితులపై అధికారులను ఆరా తీశారు. అనంతరం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పునరావాస చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా కల్పించాలని అధికారులు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వరద బాధితులకు తాగు నీరు, ఆహారం అందించడంలో ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని, నాణ్యమైన ఆహారం, స్వచ్ఛమైన తాగు నీరు అందించాలని తెలిపారు. అదే విధంగా వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ వరదల్లో చిక్కుకుని ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అనంతరం వరదల వల్లు రైతులకు కలిగిన నష్టంపై ఆయన ఆరా తీశారు.
Vijayawada | ఈ వరదల కారణంగా ఎంత మేరా పంట నష్టం జరిగింది. ఎంతమంది రైతులకు ఎంత మేరా నష్టం జరిగింది వంటి వివరాలను సేకరించాలని ఆయన తెలిపారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. రైతులను, వారి పాడి పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించడాన్ని యుద్దప్రాతిపదిక చేపట్టాలని, వరదల కారణంగా పశువులను కోల్పోయిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని కూడా చెప్పారు.