రాష్ట్ర యువతకు ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) శుభవార్త చెప్పారు. విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతోన్న విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు జరిగిన ఈ పెట్టుబడిదారుల సదస్సు నేడు(శనివారం) ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ పలు విషయాలు వెల్లడించారు. ఈ సమ్మిట్‌లో 352 ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. దీనిద్వారా రాష్ట్రానికి రూ.13.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. తొలుత రూ.5 లక్షల కోట్లు వస్తాయని భావిస్తే అంతకుమించి.. రూ.13.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ పరిశ్రమల ద్వారా రానున్న రోజుల్లో ఏపీలో 6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని మంత్రి చెప్పారు. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండానే పరిశ్రమలను స్థాపిస్తామని మంత్రి తెలిపారు.
Read Also: హైదరాబాద్‌లో సానియా మీర్జా ఫేర్ వెల్ మ్యాచ్.. ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్!
Follow us on: Google News