వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. మంత్రి గుమ్మనూరు జయరాం(Gummanur Jayaram) తెలుగుదేశం పార్టీలో చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇవాళ ఉదయమే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుడిలో విగ్రహంలా సీఎం జగన్ మారిపోయారని.. ఆయనకు నాయకులు ఏం చెప్పినా వినిపించడం లేదన్నారు. జగన్ అనే విగ్రహానికి ఇద్దరు పూజారాలు ఉన్నారని.. వారు చెప్పిందే ఆయన వింటున్నారని చెప్పారు. ఆ ఇద్దరు పుజారులైన సజ్జల రామ కృష్ణా రెడ్డి, ధనునంజయ రెడ్డి కలిసి ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. భక్తులుగా ఉన్న మమ్మల్ని వదిలేసి వారసులను వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు.
మంత్రిగా ఉన్నా కూడా తన నియోజకవర్గం ఆలూరు అభివృద్ధి చెందలేదు కానీ పక్కనే ఉన్న ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గం డోన్ మాత్రం అభివృద్ధి చెందిందన్నారు. వైసీపీలో కేవలం రెడ్డి సామాజిక వర్గానికే మాత్రం ప్రాధాన్యత ఇస్తారని ఆరోపించారు. కాగా అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం నుంచి జయరాం(Gummanur Jayaram) టీడీపీ తరపున పోటీ చేయనున్నారు.