మంత్రి నిమ్మల రామానాయుడిని సభ నుండి సస్పెండ్ చేయిస్తా అని మంత్రి నారా లోకేష్(Nara Lokesh) సరదాగా అన్నారు. ఇటీవల నిమ్మల రామానాయుడు అనారోగ్యానికి గురయ్యారు. గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన, హాస్పిటల్ లో సెలైన్లు ఎక్కించుకుని అసెంబ్లీకి హాజరవుతున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ లాబీలో ఎదురుపడిన నిమ్మల రామానాయుడిని(Nimmala Ramanaidu) లోకేష్ పరామర్శించారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. నిమ్మల కాన్యులాతో అసెంబ్లీ కి రావడంపై లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. “అన్నా అసెంబ్లీ కి ఎందుకు వచ్చారు? సస్పెండ్ చేయించమంటారా..? లేదా రెస్ట్ తీసుకుంటారా?” అని ప్రశ్నించారు.
ఒక రెండురోజులు రెస్ట్ తీసుకుంటే ఆరోగ్యం కుదుటపడుతుందని నిమ్మలకి లోకేష్ సూచించారు. నిన్నటితో పోలిస్తే ఈరోజు పర్వాలేదు అని రామానాయుడు తెలిపారు. వర్క్ లోడ్ తో ఉన్నందున మైండ్ డైవర్షన్ కోసం రెస్ట్ కచ్చితంగా తీసుకోవాలని ఆయన్ను మంత్రి లోకేష్(Nara Lokesh) కోరారు. కలలో మీకు పోలవరం.. నాకు పాఠశాలలు కనిపిస్తున్నాయని సరదాగా మాట్లాడుకున్నారు.