తల్లికి వందనం పథకాన్ని తమ ప్రభుత్వం అటకెక్కించలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వంపై బ్లూ మీడియా బురదజల్లడానికి ప్రయత్నిస్తుందని, అందులో భాగంగానే తల్లికి వందనం విషయంలో లేనిపోని షరతులు పెట్టామని అసత్య ప్రచారాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వైసీపీ(YCP) తరహాలో ప్రజలకు మోసం చేయదని, ప్రజలకు ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకుంటుందని భరోసా కల్పించారు. అసలు తల్లికి వందనం పథకంపై ప్రశ్నించే హక్కు వైసీపీ లేదని మండిపడ్డారు.
‘‘ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే వారందరికీ రూ.15 వేలు చొప్పుల అమ్మఒడి ఇస్తామని చెప్పి తల్లులను మోసం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అది కూడా అధికారంలోకి వచ్చిన ఏడాదికి కానీ అమలు చేయలేదు. అమలు చేసిన నాలుగేళ్లలో కూడా ఒక ఏడాది డుమ్మా కొట్టారు. అలాంటి మా ప్రభుత్వం వచ్చి ఇంకా 30 రోజులు కూడా కాలేదు అప్పుడే ప్రశ్నిస్తున్నారు. మా ప్రభుత్వం చేస్తున్న పనులు చూసి భయపడే బ్లూ మీడియా సహాయంతో కొందరు ఈ అసత్య ప్రచారం చేయిస్తున్నారు. తల్లికి వందనం పథకం(Thalliki Vandanam Scheme) అందించడానికి ఆధార్ వినియోగించనున్నాం. అందుకోసం UDAI నుంచి కావాల్సిన అనుమతులు తీసుకోవాల్సి ఉంది. వాటి కోసమే ప్రయత్నిస్తున్నాం. అందుకే ఆలస్యం. రాష్ట్రంలోని ఏ తల్లి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకాన్ని అందిస్తాం’’ అని ఆయన( Nimmala Ramanaidu) మరోసారి భరోసా కల్పించారు.
తల్లులను అబద్ధాలతో మభ్యపెడుతున్న జగన్ రెడ్డి, నీలిమీడియా – మంత్రి నిమ్మల రామానాయుడు మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి..#ManaPalakolluManaRamanaidu#ministernimmla#nimmala#palakollu#APMinister#MLA#NimmalaRamaNaidu pic.twitter.com/ukoWIZoY6r
— Nimmala Ramanaidu (@RamanaiduTDP) July 13, 2024