Mla Anil Kumar Yadav: నెల్లూరులో ఏమి జరిగినా నాకు అంట గడుతున్నారు

-

Mla Anil Kumar Yadav Fires on Tdp leaders: నెల్లూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డిని కారుతో రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు బాలాజీనగర్‌లోని కోటం రెడ్డి ఇంటివద్ద ఢీ కొట్టడంతో శ్రీనివాసులరెడ్డిని వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ దాడి పై టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపైఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ దాడిపై మాజీమంత్రి, ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ స్పందించారు. నెల్లూరులో ఏమి జరిగినా నాకు అంట గడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నేత కోటంరెడ్డి పై జరిగిన దాడి వ్యక్తిగతమన్నారు. ఈ విషయాన్ని టీడీపీ నేతలు సోమిరెడ్డి, అబ్దుల్ అజీజ్‌‌లు టీడీపీ నేతలకు వివరించారని.. కానీ అచ్చెన్నాయుడు, లోకేష్, చంద్రబాబులు నా ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. కోటంరెడ్డి పై కారుతో దాడి చేసిన రాజశేఖర్ రెడ్డికి కోటంరెడ్డి కుటుంబనికి మధ్య ఏదో వివాదం ఉందని.. పోలీసులు విచారణ చేస్తున్నారన్నరని అనిల్ (Mla Anil Kumar Yadav) పేర్కొన్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...