Mp Gvl Narasimha Rao says we welcome pawan kalyan comments: గుంటూరు జిల్లాలోని ఇప్పటంలో రాష్ట్ర ప్రభుత్వం పై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ఈ క్రమంలో ఆదివారం ట్విట్టర్ వేదికగా స్వాగతిస్తున్నట్లు తెలిపారు.‘‘ కుటుంబ, వంశ రాజకీయాలకు వ్యతిరేకంగా పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాను. అలాగే, పధకాల పేర్లను సొంత డబ్బా కోసం ‘‘జగనన్న’’ పేరుతో ప్రచారం చేసుకోవటం తప్పు. ఈ తప్పుడు సంస్కృతిని అవలంబించే వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయమయిన బీజేపీ-జనసేన నుంచే విముక్తి సాధ్యం.’’ అని ట్విట్టర్‌లో Mp Gvl Narasimha Rao వెల్లడించారు.
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఆదివారం పవన్ పరిహరం అందిచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘వైసీపీ నాయకులు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తే ఏం చేయాలో నాకు తెలుసు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తాం. 2024లో జనసేన అధికారంలోకి వచ్చాక లీగల్ విధానంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేల ఇళ్లు కూలుస్తాం. వైసీపీ ఫ్యూడలిస్టిక్ గోడలు బద్దలు కొడతాం.’’ అని సవాల్ చేశారు.
కుటుంబ, వంశ రాజకీయాలకు వ్యతిరేకంగా @PawanKalyan గారు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాను. అలాగే, పధకాల పేర్లను సొంత డబ్బా కోసం 'జగనన్న' పేరుతో ప్రచారం చేసుకోవటం తప్పు. ఈ తప్పుడు సంస్కృతిని అవలంబించే వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయమయిన బీజేపీ-జనసేన నుంచే విముక్తి సాధ్యం. @BJP4Andhra
— GVL Narasimha Rao (@GVLNRAO) November 27, 2022