Pawan Kalyan | పవన్ వ్యాఖ్యలపై ముద్రగడ, జోగయ్య స్పందన.. మీ ఖర్మ అంటూ లేఖలు.. 

-

తనకు సలహాలు, సూచనలు ఎవరూ ఇవ్వొద్దని తాడేపల్లిగూడెం సభ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యల నేపథ్యంలో కాపు సీనియర్ నేతలు హరిరామజోగయ్య, ముద్రగడ పద్మనాభం స్పందిస్తూ బహిరంగ లేఖలు రాశారు.

- Advertisement -

ముద్రగడ లేఖలోని అంశాలు.. 

‘మిత్రులు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గారు.. 2019 ఎన్నికల ముందు కవాతు సందర్భంగా కిర్లంపూడి వస్తానని కబురు పంపారు. అయోధ్య వెళ్లొచ్చిన తర్వాత కిర్లంపూడి వస్తానని మరోకసారి కబురు పంపించారు. ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పాను. అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి నా వంతు కృషి చేయాలని, ఎటువంటి ఫలితం ఆశించని సేవ మీతో చేయించాలని అనుకున్నాను. మన ఇద్దరి కలయిక జరగాలని యావత్‌ జాతి చాలా బలంగా కోరుకున్నారు, వారి అందరి కోరిక మేరకు నా గతం, నా బాధలు, అవమానాలు, ఆశయాలు, కోరికలు అన్ని మరచి మీతో ప్రయాణం చేయడానికి సిద్దపడ్డాను. రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వరవడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించాను. మీరు అదే ఆలోచనలో ఉన్నారని నమ్మానండి, కాని దురదృష్టవశాత్తు నాకు మీరు ఆ అవకాశం ఇవ్వలేదు’ లేఖలో పేర్కొన్నారు.

‘గౌరవ చంద్రబాబునాయుడు గారు జైలులో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ కేడర్ బయటకు రావడానికి భయపడి ఇంచుమించుగా ఇళ్లకే పరిమితం అయిపోయారండి. అటువంటి కష్టకాలంలో తమరు జైలుకి వెళ్లి వారికి భరోసా ఇవ్వడమన్నది సామాన్యమైన విషయం కాదండి, చరిత్ర తిరగరాసినట్టు అయ్యిందండి. వారి పరపతి విపరీతంగా పెరగడానికి ఎవరు ఎన్ని చెప్పినా మీరే కారకులని బల్లగుద్ది చెప్పగలనండి. గౌరవ ప్రజలు ఇంచుమించుగా అందరూ మిమ్ములను ఉన్నత స్థానంలో చూడాలని తహతహాలాడానండి. పవర్‌ షేరింగు కోసం ప్రయత్నం చేసి అసెంబ్లీ సీట్లు 80, రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముందుగా మిమ్మల్ని చేయమని కోరి ఉండాలండి, ఆ సాహసం మీరు చేయలేకపోవడం చాలా బాధాకరమండి. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం గాని, పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం గాని చేయలేదండి. భగవంతుడ్ని ఆ పరిస్థితి రాకుండా చేయమని తరచూ కోరుకుంటానండి’ అన్నారు.

‘కాని మీలాగా గ్లామర్‌ ఉన్నవాడిని కాకపోవడం, ప్రజలలో పరపతి లేనివాడిని అవ్వడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్‌ గ్రేడ్‌ వ్యక్తిగా, తుప్పు పట్టిన ఇనుము లాంటి వాడిగా గుర్తింపు పడడం వల్ల మీరు వస్తానని చెప్పించి, రాలేకపోయారు. మీ నిర్ణయాలు మీ చేతులలో ఉండవు, ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాలండి. మీ పార్టీ పోటీచేసే 24 మంది కోసం నా అవసరం రాదు, రాకూడదని భగవంతున్ని ప్రార్ధిస్తున్నానండి.. ఆల్ ది బెస్ట్ అండి’ అంటూ లేఖను ముగించారు.

ఇక హరిరామ జోగయ్య అయితే టీడీపీ-జనసేన బాగు కోరి తాను ఇచ్చిన సలహాలు ఇద్దరు అధినేతలకు నచ్చినట్లు లేదని.. ఇక వాళ్ల ఖర్మ అంటూ లేఖలో తెలిపారు.

Read Also: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...