పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో కావచ్చేమో కానీ.. రాజకీయాల్లో మాత్రం నేనే హీరోని.. రాజకీయాల్లో మొలతాడు లేనివాడు కూడా తనను విమర్శిస్తున్నారని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విమర్శించారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత జనసేన పార్టీ క్లోజ్ అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. రాబోయే 30 సంవత్సరాలు జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
“సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో నాపై తప్పుడు రాతలు రాస్తున్నారు. నేనేమీ కండీషన్లు పెట్టి వైసీపీలో చేరలేదు. ఎలాంటి షరతులు లేకుండానే వైఎస్‌ఆర్‌సీపీలో చేరా. ప్రజలకు సేవ చేయడానికే ఈ పార్టీలో చేరా. మీరు చెప్పినట్లు నేనేందుకు రాజకీయం చేయాలి. నాకు చెప్పడానికి మీరెవరూ. జగన్ దగ్గరకు ఎందుకు వెళ్లావు.. పవన్ వద్దకు ఎందుకు వెళ్లలేదంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. జగన్ కుటుంబానికి రాజకీయంగా ఒక చరిత్ర ఉంది.
నేనేదో ఆశించి వైసీపీలో చేరలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ పార్టీలో చేరాను. వైసీపీ వ్యవస్థాపకుల్లో నేనూ ఒకడిని కానీ కొన్ని కారణాల వలన జగన్‌కు దూరమయ్యాయను.. మళ్లీ ఇప్పుడు చేరడం ఆనందంగా ఉంది. అధిష్టానం ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తా. నాకు రాజకీయ భిక్ష పెట్టింది బీసీలు, దళితులు, కాలపులు ఐదుశాతం ఉంటారు. నేను రాజకీయాలకు రావడానికి కాపులు కారణం కాదు. నేను ఎవ్వరి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకు కులం కాదు ముఖ్యం.. నాకు వర్గం ముఖ్యం. పవన్ కళ్యాణ్‌ను మారుద్దామని ఎంతగా ప్రయత్నించినా కుదరలేదు.. 21 సీట్లలోనే పోటీకి పరిమితం కావటంతో పవన్ కళ్యాణ్ బలమెంతో ప్రజలకు అర్థమైపోయింది” అంటూ విమర్శలు చేశారు.