Naga Babu | సీఎం జగన్‌కి వ్యంగ్యంగా నాగబాబు బర్త్‌డే విషెస్

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(CM Jagan) పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు జగన్‌కి ప్రధాని మోదీ(PM Modi), టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan), వివిధ రాజకీయ పార్టీల నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే జనసేన నేత నాగబాబు(Naga Babu) కూడా కొంచెం వ్యంగ్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

“సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. కర్నూల్ మల్లికార్జున స్వామి, విశాఖ సింహాద్రి అప్పన్న స్వామి, విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలి. రాజధాని ఎక్కడో త్వరగా నిర్ణయించుకుంటే ఆ ప్రాంతాల దేవతల ఆశీస్సులు మీకు ఇంకా ఎక్కువగా ఉంటాయి”అని ట్వీట్ చేశారు. దీంతో నాగబాబు(Naga Babu) పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా..? అయితే ఇది మీకోసమే..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...