Special Trains | సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా..? అయితే ఇది మీకోసమే..

-

సంక్రాంతి పండుగకు సొంతూరుకి వెళ్లాలనుకునే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. పండుగ రద్దీ దృష్ట్యా 20 ప్రత్యేక రైళ్లు(Special Trains) కేటాయించినట్లు దక్షిణ మధ్య అధికారులు తెలిపారు. ఈ నెల 28 నుంచి జనవరి 26 వరకూ ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.

- Advertisement -

ప్రత్యేక రైళ్లు(Special Trains) వివరాలు ఇవే..

కాచిగూడ(Kachiguda) – కాకినాడ టౌన్(Kakinada) (రైలు నెం – 07653): ఈ రైలు డిసెంబర్ 28, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో నడుస్తుంది. ఈ నెల 28న (గురువారం) రాత్రి 8:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటుంది.

కాకినాడ టౌన్ – కాచిగూడ (రైలు నెం – 07654): ఈ రైలు డిసెంబర్ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో ప్రయాణిస్తుంది. ఈ నెల 29న (శుక్రవారం) సాయంత్రం 5:10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4:50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

హైదరాబాద్ – తిరుపతి (రైలు నెం 07509): ఈ రైలు డిసెంబర్ 29, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో అందుబాటులో ఉండనుంది. గురువారం రాత్రి 7:25 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8:20 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.

తిరుపతి(Tirupati) – హైదరాబాద్(Hyderabad) రైలు (07510): ఈ రైలు డిసెంబర్ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో రాకపోకలు సాగిస్తుంది. డిసెంబర్ 29 రాత్రి 8:15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8:40 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.

కాచిగూడ – కాకినాడ టౌన్ – కాచిగూడ ప్రత్యేక రైళ్లు (రైలు నెం. 07653/07654): మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయి.

హైదరాబాద్ – తిరుపతి – హైదరాబాద్ ప్రత్యేక రైళ్లు (రైలు నెం. 07509/07510): సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ. నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

Read Also: కోమటిరెడ్డికి జగదీశ్వర్ రెడ్డి సవాల్.. స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...