మంత్రి రోజా కి నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ (వీడియో)

-

Nagababu Strong Counter to Minister Roja: ఏపీ మంత్రి రోజాపై జనసేన నేత నాగబాబు సంచలన కామెంట్స్ చేశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులపై రోజా చేసిన కామెంట్స్ కి నాగబాబు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు వీడియోను రిలీజ్ చేశారు. చిరంజీవి పవన్ ను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పిచ్చి మాటలు ఆపి, ఇప్పటికైనా పని చూసుకోవాలంటూ సూచించారు. పర్యాటక రంగంలో ఏపీ 18వ స్థానంలో ఉందని, రోజా మంత్రి పదవి ముగిసే వరకు అది 20వ స్థానంలోకి వెళ్తుందని ఎద్దేవా చేశారు. నువ్వు పర్యటనలు చేస్తే పర్యాటక శాఖ అవుతుందా అంటూ విమర్శించారు. గతంలో ఎన్నిసార్లు రోజా విమర్శించినా స్పందించలేదని ఊరుకునేది లేదని స్పష్టం చేశారు నాగబాబు. కాగా గురువారం రోజా మాట్లాడుతూ.. ముగ్గురు అన్నదమ్ములు సొంత నియోజకవర్గాలకు ఏమి చేయలేదు కాబట్టే ప్రజలు ఓడించారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ సహనటుడు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందని అన్నారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై నాగబాబు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

- Advertisement -

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YCP Manifesto : వైసీపీ మేనిఫెస్టో కొత్త హామీలు ఇవే..

వైసీపీ మేనిఫెస్టోను తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌...

Prasanna Vadanam | ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ అదిరిపోయిందిగా..

యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే...