ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. రోడ్లపైకి భారీగా వరదనీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. తాజాగా.. వరదల్లో చిక్కుకున్న ముంపు ప్రాంతాల ప్రజల పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన నందిగామ(Nandigama) ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు(MLA Jagan Mohan Rao) వరదల్లో చిక్కుకున్నారు. నందిగామ పాత బస్టాండ్‌లో ఎమ్మెల్యే చిక్కుకున్నారు. వరద ప్రవాహం ఎక్కువ కావడంతో ట్రాక్టర్‌పై కూర్చున్న ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు ఎటూ కదలలేని స్థితిలో ఉండిపోయారు. దీంతో పోలీసులు భారీగా అక్కడకు చేరుకొని ఎమ్మెల్యేను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MLA Jagan Mohan Rao | వరదనీటిలో చిక్కుకున్న నందిగామ ఎమ్మెల్యే
-