భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

-

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. నువ్వానేనా అనే రీతిలో పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. దళితులను పచ్చి బూతులు మాట్లాడినట్టుగా ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆ ఆడియో క్లిప్‌పై వైసీపీ నేతలులు మండిపడుతున్నారు. టీడీపీ నేతలకు తొలి నుంచి దళితులంటే చిన్న చూపు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

మరోవైపు టీడీపీ నేతలు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఓటమి భయంతో ఫేక్ ఆడియోలు తిప్పుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఆ పార్టీ బతుకే ఫేక్ బతుకు అంటూ విమర్శలు చేస్తున్నారు. “మొన్న ఇంటలిజెన్స్ రిపోర్ట్ అంటూ ఫేక్, నిన్న ఈటీవీ వీడియోతో ఫేక్, నేడు భువనేశ్వరి గారి ఆడియోని డీప్ ఫేక్ చేశారు. జగన్ రెడ్డి… భువనేశ్వరి అంటే ఎందుకు నీకు అంత కడుపు మంట ? అసెంబ్లీలో బూతులు తిట్టించి నవ్వుకున్నావ్, ఇప్పుడు ఆమె ఆడియోని ఫేక్ చేసావ్. ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని, ఓట్లు కోసం ఇంతగా దిగజారతావా ? ఏమి బ్రతుకు జగన్ నీది? అంటూ ఘాటుగా ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...