Nara Lokesh Comments Over Petrol Attack On TDP Ex-MLA Raavi Venkateswara rao in Gudivada: గుడివాడ లో టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు కి వైసీపీ శ్రేణుల బెదిరింపు కాల్స్ ఘర్షణలకు దారి తీసింది. దీనిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.
గుడివాడలో గడ్డం గ్యాంగ్ కి గుండు కొట్టించే రోజు అతి దగ్గర్లో ఉంది. అధికారపక్షం రౌడీలు రాళ్ళు వేసినా, భౌతిక దాడులు చేసినా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తాం అంటే మా దగ్గర అంత కంటే పెద్ద రాళ్ళే ఉన్నాయని గుర్తు పెట్టుకోవాలి. గుడివాడలో టిడిపి నేత రావి వెంకటేశ్వరరావు(Raavi Venkateswara rao)ని చంపేస్తామని బెదిరిస్తూ.. ఆస్తులు ధ్వంసం చేసి, టిడిపి కార్యకర్తలపై గడ్డం గ్యాంగ్ చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు సైకో పాలనకి చరమగీతం పాడేందుకు సిద్దంగా ఉన్నారనే విషయం సర్వేల్లో తేలడంతోనే జగన్ రెడ్డి గూండాలను నమ్ముకుంటున్నాడు. గుడివాడ టిడిపి వారిపై బెదిరింపులు, దాడులకు పాల్పడిన వైసిపి గడ్డం గ్యాంగ్ పై కేసులు పెట్టి అరెస్టు చేయాలి అంటూ ట్విట్టర్ వేదికగా లోకేష్(Nara Lokesh) మండిపడ్డారు.