వైసీపీ ప్రభుత్వంలో ఏపీ దక్షిణ బీహార్‌గా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) విమర్శించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(Governor Abdul Nazeer)ను కలిసి టీడీపీ నేతలు కలిసి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై ఫిర్యాదు చేశారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ టీడీపీ సానుభూతిపరులపై ఇప్పటివరకు 60 వేల కేసులు పెట్టారని.. మాజీ సీఎం చంద్రబాబుపై ఆధారాలు లేకుండా కేసులు పెట్టిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీకి రాకుండా ఎలా అడ్డుకున్నారనే విషయాన్ని తెలియజేశామన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నర్‌కు ఉందన్నారు.
38 కేసులు ఉన్న దొంగోడు.. రాష్ట్రాన్ని దోచేస్తున్న దొంగోడు.. సొంత బాబాయ్‌ని చంపేసిన వాడు.. సొంత తమ్ముడుని కాపాడుకోవడానికి సీబీఐని రాష్ట్రానికి రానివ్వని జగన్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలపై ఎన్ని కేసులు పెట్టినా సిద్ధంగా ఉన్నామని.. భయం తమ బయోడేటాలోనే లేదని హెచ్చరించారు. ప్రస్తుతం చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఉన్నారని.. కోర్టు తీర్పులను బట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ఉమ్మడి కార్యాచరణపై జనసేనతో సంప్రదింపులు జరిపామని.. త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని లోకేశ్(Nara Lokesh) పేర్కొన్నారు.