అదంతా వైసీపీ చేస్తున్న విషప్రచారమే.. తణుకు అన్న క్యాంటీన్‌పై లోకేష్

-

Tanuku Anna Canteen | తణుకులోని అన్న క్యాంటీన్‌లో ప్లేట్లను మురికి నీటితో కడుగుతున్న వీడియో రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పేదోడంటే టీడీపీకి చులకన అని, అందుకే ఇంత దారుణంగా చేస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై మంత్రి నారా లోకేష్(Nara Lokesh) స్పందించారు. అన్న క్యాంటిన్లలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నామని, పూర్తిస్థాయిలో ప్రజలకు హైజీన్ ఆహారం, ఆవరణాన్ని అందిస్తున్నామని లోకేష్ చెప్పారు. రెండు రోజులుగా సోషల్ మీడియా హల్‌చల్ చేస్తున్న వీడియో అంతా కూడా వైసీపీ మూకలు చేస్తున్న విషప్రచారంలో భాగమే అని ఆరోపించారు. అన్న క్యాంటీన్లకు లభిస్తున్న ఆదరణను చూసి జీర్ణించుకోలేక వైసీపీ మూకలు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి అన్న క్యాంటీన్‌లో కూడా రుచి, శుచి, శుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, సిబ్బంది సైతం వీటిని తూచా తప్పకుండా పాటిస్తున్నారని చెప్పుకొచ్చారు.

- Advertisement -

Tanuku Anna Canteen | ‘‘తణుకు అన్న క్యాంటీన్లో అంటూ వైరల్ అవుతున్న వీడియో అంతా కూడా వైసీపీ మూకలు చేస్తున్న విష ప్రచారంలో భాగమే. చేతులు కడిగే సింక్‌లో తినే ప్లేట్లు పడేసింది వైసీపీ మూకలే. దాని సిబ్బంది తీస్తున్నప్పుడు వీడియో తీసి.. ఆ నీటిలోనే ప్లేట్లు కడుగుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విష ప్రచారం చేయాలన్న ఉద్దేశంతోనే సైకో బ్యాచ్ ఈ పనిచేసింది. సింక్‌లోని ప్లేట్లు తీస్తుంటే.. దానిని వక్రీకరించి దుష్ఫ్రచారం చేస్తోంది. అన్న క్యాంటీన్లకు రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. అది తట్టుకోలేక సైకో జగన్ మూకలు.. ఇలాంటి తప్పుడు వీడియోలు తీస్తున్నాయి. చేతులు కడిగే సింక్‌లో వాళ్లే ప్లేట్లు పడేసి.. వాటిని తీస్తుంటే వీడియోలు తీసి తప్పుగా ప్రచారం చేస్తున్నారు’’ అని మండిపడ్డారు లోకేష్.

Read Also: ‘భారత్‌కు బంగ్లాదేశ్ పరిస్థతి వచ్చేది’.. కంగనా వివాదస్పద వ్యాఖ్యలు
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

China | అమెరికాకి కౌంటర్ షాకిచ్చిన చైనా

China - US | అమెరికాకి డ్రాగన్ కంట్రీ షాకిచ్చింది. చికెన్,...

KTR | సీసీఐ ఫ్యాక్టరీపై భారీ కుట్ర: కేటీఆర్

ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర...