‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంపై నారా లోకేశ్ సెటైర్లు

-

వైసీపీ నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలుపెట్టిన ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) సెటైర్లు వేశారు. ‘వై ఏపీ నీడ్స్ జగన్’?.. ఏపీకి జగన్ ఎందుకు కావాలి? అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా సరిగ్గా ఇదే అడుగుతున్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకుని, ధ్వంసం చేసిన జగన్‌ను ఏపీ ఎందుకు కావాలనుకుంటుంది?’ అని ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

- Advertisement -

జీరో వాడకం… రూ.295 బిల్లు అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనంపైనా లోకేశ్ స్పందించారు. ‘వాహ్… ఒక్క యూనిట్ కూడా వాడని ఇంటికి రూ.295 కరెంటు బిల్లు బాదుడు. సొంత పేపరు, చానల్, సిమెంటు, విద్యుత్ కంపెనీలు, ఊరికో ప్యాలెస్ ఉన్న అవినీతి అనకొండ, పెత్తందారుడు జగన్ పేదలకు రూపాయి స్కీం ఇచ్చి వెయ్యి రూపాయలు దోచే స్కాం. జనాన్ని క్యాన్సర్ గడ్డలా పట్టి పీడిస్తున్న నువ్వు బిడ్డ ఎలా అవుతావు జగన్? అంటూ ధ్వజమెత్తారు.

ఇక ‘తెలంగాణ ఎన్నికల్లో(Telangana Elections) కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు రాసినట్లు ఓ లేఖ వైరల్ కావడంపైనా లోకేశ్‌(Nara Lokesh) తీవ్రంగా స్పందించారు. ‘కుల,మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతూ పైశాచిక ఆనందం పొందే సైకో జగన్ కిరాయి మనుషులు చంద్రబాబు నాయుడు పేరుతో ఒక ఫేక్ లెటర్ వదిలారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన వైకాపా ఫేక్ ఎత్తుగడల పట్ల అప్రమత్తంగా ఉండాలి’ ప్రజలకు సూచించారు.

Read Also: కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో అపశృతి.. వాహనంపై నుంచి జారిపడిన మంత్రి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...