Nara Lokesh | తమ డిమాండ్లు నెరవేర్చాలని దాదాపు నెల రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలపై ప్రభుత్వం ఎస్మా(Esma) చట్టం ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సమ్మెను అత్యవసరల జాబితా కిందకు తెస్తూ జీవో నెంబర్ 2 విడుదల చేస్తూ 6 నెలల పాటు ఎలాంటి సమ్మెలు, ఆందోళనలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. అలాగే సమ్మెలో పాల్గొన్న అంగన్‌వాడీ కార్యర్తలు, హెల్పర్ల జీతంలో కోత కూడా విధించింది.
అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగంపై టీడీపీ యువనేత నారా లోకేష్(Nara Lokesh) తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం తక్షణమే జీవో నెంబర్ 2 ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అమ్మనే గెంటేసినవాడికి అంగన్వాడీల విలువ ఏం తెలుస్తుంది? పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని శాంతియుత నిరసనలు తెలపడం కూడా నేరమేనా? అని ఆయన ప్రశ్నించారు. అంతిమంగా నెగ్గేది అంగన్వాడీలేనని.. వారి ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ట్వీట్ చేశారు.
మరోవైపు ఎస్మా ప్రయోగంపై అంగన్‌వాడీలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎస్మాకు భయపడేది లేదని తేల్చి చెబుతున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఎన్నికల్లో తమ ఓటుతో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చిరంచారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె ఆపేది లేదని స్పష్టం చేశారు.
అమ్మనే గెంటేసినవాడికి అంగన్వాడీల విలువ ఎం తెలుస్తుంది? పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని శాంతియుత నిరసనలు తెలపడం కూడా నేరమేనా? అంగన్‌వాడీ ఉద్యమం పై సైకో సర్కార్ ఉక్కుపాదం మోపడం దారుణం. అంగన్వాడీల పై ఎస్మా ప్రయోగం, సమ్మె కాలానికి వేతనంలో కోత పెట్టడం.. జగన్ నియంత పోకడలకు… pic.twitter.com/dgC3PhbIND
— Lokesh Nara (@naralokesh) January 6, 2024