ప్రజా సేవే ధ్యేయంగా దూసుకెళ్తున్న నేతల్లో నారా లోకేష్(Nara Lokesh) పేరు తప్పకుండా ఉంటుంది. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆయన ప్రతి రోజూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం శక్తివంఛన లేకుండా శ్రమిస్తున్నారు. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా విద్యార్థుల కోరిక మేరకు ఓ ఊరికి బస్ సర్వీస్‌ను కల్పించారు. బస్ సర్వీస్ లేక తాము రోజూ చాలా ఇబ్బందులు పడుతున్నామని, కళాశాలకు, పాఠశాలకు వెళ్లాలంటే చాలా కష్టమవుతుందని, దయచేసి తమ ఊరికి బస్ సర్వీస్‌ను కల్పించాలంటూ తమ సమస్యను కర్నూల్ జిల్లా హోలగుంద మండలం మార్లమడి గ్రామానికి చెందిన విద్యార్థులు మెయిల్ చేశారు. ఆ మెయిల్‌ను చూసిన నారా లోకేష్ వెంటనే స్పందించి వారి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఇచ్చిన మామీ ప్రకారం మార్లముడి గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీస్‌ను తీసుకొచ్చారు. విద్యార్థుల సమస్యను రవాణాశాఖ మంత్రి రామ్‌ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన ఆ గ్రామానికి బస్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే స్పందించిన రవాణా శాఖ మంత్రి.. అదోనీ ఆర్టీసీ బుక్ డిపోకు తగిన ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాల మేరకు డిపో అధికారులు మార్లమడి గ్రామానికి బస్ సర్వీస్‌ను ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకుని విద్యార్థి సంఘాలు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు మంత్రి నారా లోకేష్(Nara Lokesh)కు కృతజ్ఞతలు తెలిపాయి.