మా ఓపిక నశించింది.. ఇక యుద్ధమే.. జగన్‌కు లోకేశ్ వార్నింగ్

-

సీఎం జగన్‌, వైసీపీ నేతలకు టీడీపీ యువనేత నారా లోకేశ్(Nara Lokesh) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 180వ రోజులో యువగళం పాదయాత్రలో పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం దొడ్లేరులో వైసీపీ బాధితులతో లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు. సీఎం వీధి రౌడీ కావడం వల్లే ఆయనను ఆదర్శంగా తీసుకొని వైసీపీ సైకోలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. 51 నెలల్లో 64 మంది టీడీపీ(TDP) కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారని.. వేలాది మందిపై తప్పుడు కేసులు బనాయించారని వెల్లడించారు. ఇక మా ఓపిక నశించిందని.. చంద్రబాబు(Chandrababu) ఆగమన్నా ఆగేది లేదని నిప్పులు చెరిగారు. బ్యాంకులను ముంచేసి లక్ష కోట్లు దొబ్బి 16 నెలలు చిప్పకూడు తిన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావడం వల్లే రాష్ట్ర ప్రజలు నరకం చూస్తున్నారని తెలిపారు.

- Advertisement -

తాము కార్యకర్తలను రెచ్చగొడుతున్నామని సజ్జల అంటున్నారని.. మా వాళ్లను ఊచకోత కోస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. మా ఓపిక నశించింది… మా వాళ్ల జోలికొస్తే జరగబోయేది యుద్ధమే అని హెచ్చరించారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు జగన్(YS Jagan) శ్రీకారం చుట్టారని.. తాను ఫుల్ స్టాప్ పెడతానని పేర్కొన్నారు. ఇప్పుడు ఏకంగా మా అధినేత చంద్రబాబు పైనే హత్యాయత్నం చేశారని.. మరోసారి ఆయన జోలికొస్తే జరగబోయే పరిణామాలకు జగన్మోహన్ రెడ్డే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

చంద్రబాబు ఇంటిపై దాడిచేసిన వారికి, మమ్మల్ని బూతులు తిట్టేవారికి మంత్రి పదవులు ఇస్తున్నారన్నారు. జగన్ ఒక సైకో… చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి లాంటి సైకోలను జిల్లాకు ఒకర్ని తయారు చేసి మా కార్యకర్తలపైకి ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. వైసీపీ గూండాల మాటలు విని మా కార్యకర్తలను వేధించే పోలీసులను వదిలిపెట్టను.. అధికారంలోకి రాగానే టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేసి కటకటాల వెనక్కి కూడా పంపుతామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పసుపు సైనికులు ధైర్యంగా ఉండండి… ఈ లోకేశ్(Nara Lokesh) మీకు అండగా నిలచి గుండెల్లో పెట్టుకొని కాపాడతాడని భరోసా ఇచ్చారు.

Read Also: హాట్ టాపిక్ గా మారిన ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...