టీడీపీ యువనేత నారా లోకేశ్(Nara Lokesh) మరోసారి ప్రజల మధ్యకు రానున్నారు. ఇప్పటికే యువగళం పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన ఆయన మరో కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఈనెల 11 నుంచి ఎన్నికల ‘శంఖారావం(Shankharavam)’ పూరించనున్నారు. యువగళం జరగని ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఈ ‘శంఖారావం’ ప్రారంభంకానుంది. ప్రతిరోజు 3 నియోజకవర్గాల చొప్పున దాదాపు 50 రోజుల పాటు పర్యటన సాగనుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 11వ తేదీ ఉదయం 9 గంటలకు తొలి సభ జరుగనుంది.
శంఖారావం(Shankharavam)పై రూపొందించిన ప్రత్యేక వీడియోను పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విడుదల చేశారు. ప్రజల్లోనూ, పార్టీ శ్రేణుల్లో చైతన్యం నింపటమే ఈ శంఖారావం లక్ష్యమని ఆయన తెలిపారు. జగన్ పాలనలో మోసపోయిన యువత, మహిళలు, ఇతర అన్ని వర్గాలకు భరోసా కల్పించేలా లోకేశ్ పర్యటన సాగనుందని అచ్చెన్న వెల్లడించారు.