Yuvagalam Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టనున్న యువగళం పాదయాత్ర ఈ నెల 27 న మొదలుపెట్టనున్నారు. కుప్పం నుండి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర 4000 కిలోమీటర్లు 400 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగనుంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ కీలక తీసుకున్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి, 3 మతాలకి సంబంధిచిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలను దర్శించుకోనున్నారు.
దీనికి సంబంధించిన లోకేష్ టూర్ వివరాలివే…
25-1-23 బుధవారం మధ్యాహ్నం 1.45కి హైదరాబాద్‍లోని ఎన్టీఆర్ ఘాట్‍కి చేరుకుని నందమూరి తారకరామునికి నివాళులు అర్పించనున్నారు.
సాయంత్రం కడపకు చేరుకుంటారు.
సాయంత్రం 5.15 గంటలకు కడప అమీన్ పీర్ దర్గా సందర్శిస్తారు.
కడపలోని రోమన్ కేథలిక్ చర్చిలో సాయంత్రం 6.30కి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటారు.
7 గంటలకు దేవుని గడపలో స్వామి వారిని దర్శించుకుంటారు.
రోడ్డుమార్గంలో తిరుమల చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.
26-1-23 గురువారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు.
తిరుమల నుండి బయలుదేరి మధ్యాహ్నం 2.30కి కుప్పం చేరుకుంటారు.