Narasaraopeta Murder case: హత్యగా తేలిన అదృశ్యం కేసు.. మర్డర్‌లో ఊహించని ట్విస్టులు!

-

Narasaropeta Murder case reveled by police: పల్నాడు జిల్లాలో ఓ అదృశ్యం కేసు ఊహించని మలుపులు తిరిగింది. సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ట్విస్టులు ఉన్నాయి. తమ్ముడు కనిపించకపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఎటువంటి ఫలితం లేదనీ.. స్వయంగా అన్నే రంగంలోకి దిగాడు.. తన తమ్ముడిని అతడి స్నేహితులే చంపేసి ఉంటారన్న అనుమానంతో.. ఒక స్నేహితుడిని మట్టుబెట్టేశాడా అన్న. ఇదంతా నిజ జీవితంలో జరిగిన సంఘటనలే. యాక్షన్‌ మూవీ స్క్రిప్ట్‌ను తలపించే విధంగా ఉన్న ఈ కేసు ముడి వీడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గొరిజవోలుకి చెందిన జంగం చంటి (28) గతేడాది సెప్టెంబర్‌ 16న అదృశ్యం అయ్యాడు. చుట్టుపక్కల గాలించిన అనంతరం, చంటి అన్న బాజి అక్టోబర్‌ 24న నాదెండ్ల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ ఎటువంటి ఫలితం లేదనీ.. అన్న బాజి స్వయంగా వెతకటం ప్రారంభించాడు.

- Advertisement -

నరసరావుపేట మండలం కేసానుపల్లికి చెందిన రావిపాటి వెంకన్న, దాచేపల్లికి చెందిన నాగూర్‌ అలియాస్‌ బిల్లాతో కలిసి చంటి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడేవారు. జొన్నలగడ్డకు చెందిన సిలివేరు రామాంజనేయులు నరసరావుపేటలోని ఓ నగల దుకాణంలో పని చేసేవాడు. అతడి సాయంతో చోరీ చేసిన బంగారాన్ని మార్పిడి చేసేవారు. దీంతో రామాంజనేయులను ఈ ఏడాది ఏప్రిల్‌ 22న బాజి కిడ్నాప్‌ చేశాడు. నిజం రాబట్టే ప్రయత్నంగా.. నాదెండ్ల-యడ్లపాడు మధ్య వాగులో అతడిని ముంచి చంపేశాడు బాజి.

బాజీని చంపేందుకు ప్రణాళిక
రామాంజనేయులు హత్య కేసు విచారణలో భాగంగా నరసరావుపేట ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌కు హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న బాజీపై హత్యాయత్నం జరిగింది. ఆ దాడిలో తీవ్రగాయాలపాలయ్యాడు. ప్రాణాపాయం తప్పటంతో.. పోలీసులకు బాజీ ఫిర్యాదు చేశాడు. బాజీ ఫిర్యాదు మేరకు రావిపాటి వెంకన్న, బిల్లాతోపాటు మరికొందరిని అదుపులోకి తీసుకొని.. విచారణ చేపట్టిన పోలీసులకు(Narasaropeta Murder)లో ఊహించని విషయాలు తెలిశాయి.

గతేడాది సెప్టెంబర్‌లో కేరళ రాష్ట్రంలో బంగారు నగలను విక్రయించే పనిని చంటికి అప్పగించారు మిగిలిన ఇద్దరు. అనంతరం డబ్బు గురించి అడిగితే.. చంటి నుంచి స్పందన లేదు. దీంతో చంటిపై కోపం పెంచుకున్న వెంకన్న, బిల్లా అతడిని అంతమెుందించాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే చంటిని విజయవాడలోని ఓ లాడ్జిలో బంధించి.. చిత్రహింసలకు గురిచేసి హత్యచేశారు. మృతదేహాన్ని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరు టోల్‌గేట్‌ సమీపంలో పూడ్చిపెట్టేశారు. ఊహించని విధంగా రామాంజనేయులు హత్యకు గురికావటంతో.. బాజీ తమను కూడా చంపేస్తాడేమో అన్న భయంతో.. అతడిని చంపేందుకు ప్రణాళిక వేశారు. కానీ బాజీ ప్రాణాలతో బయటపడ్డాడు.

డీఎన్‌ఏ నిర్థారణకు నమూనా సేకరణ
నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు.. బొమ్మలూరులో మృతదేహం గురించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఒకచోట తవ్వగా, పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఓ మృతదేహం లభ్యం అయ్యింది. అస్థిపంజరంపై ఉన్న మెులతాడు, తాయత్తు, మరికొన్ని ఆధారాల ద్వారా.. అది చంటి మృతదేహంగా కుటుంబసభ్యులు నిర్థారించారు. అక్కడే శవపరీక్ష నిర్వహించి, డీఎన్‌ఏ నిర్థారణకు నమూనాలు సేకరించి, పరీక్షలు కోసం పంపించారు పోలీసులు. ఈ కేసులో రావిపాటి వెంకన్న, బిల్లాతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...