Nellore: టీడీపీ నేత కోటంరెడ్డి పైకి దూసుకెళ్లిన కారు

-

Nellore Tdp Incharge Kotam Reddy Srinivasula Reddy had a car accident నెల్లూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డిని కారుతో ఢీ కొట్టింది. రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు బాలాజీనగర్‌లోని కోటం రెడ్డి ఇంటివద్ద ఢీ కొట్టాడు. కాగా.. రాజశేఖర్‌రెడ్డి తాగి ఇంటికి వచ్చి గొడవకు దిగాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దీంతో రాజశేఖర్‌‌కు సర్దిచెప్పెందుకు శ్రీనివాసుల రెడ్డి బయటకు వచ్చారని వివరించారు. కాగా.. కారులో ఎక్కిన రాజశేఖర్ రెడ్డి వేగంగా కారుతో ఆయన్ని ఢీకొట్టి పరారయ్యాడని తెలిపారు. రోడ్డుపై పడిపోయిన శ్రీనివాసులరెడ్డిని వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. కాలుకు తీవ్ర గాయమైనట్లు తెలుస్తుంది. కాగా కోటంరెడ్డి కుమారుడు ప్రజయ్‌కు రాజశేఖర్ రెడ్డి స్నేహితుడని బంధువులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...