AP Elections | ఎన్నికల వేళ అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో కొందరు జిల్లా ఎస్పీలు, కలెక్టర్లపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. తాజగా ఆ అధికారుల స్థానంలో కొత్త అధికారులను ఈసీ నియమిస్తూ ఉత్తర్వలు జారీ చేసింది. గురువారం రాత్రి 8గంటల లోపు ఛార్జ్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
- Advertisement -
కొత్తగా నియమితులైన కలెక్టర్లు, ఎస్పీలు వీరే..
కృష్ణా జిల్లా కలెక్టర్ – డి.కె.బాలాజీ
అనంతపురం కలెక్టర్ – వి.వినోద్‌కుమార్
తిరుపతి కలెక్టర్ – ప్రవీణ్‌కుమార్
గుంటూరు ఐజీ – సర్వశ్రేష్ఠ త్రిపాఠి
ప్రకాశం జిల్లా ఎస్పీ – సుమిత్ సునీల్
పల్నాడు జిల్లా ఎస్పీ- బిందు మాధవ్
చిత్తూరు ఎస్పీ – మణికంఠ చందోలు
అనంతపురం ఎస్పీ- అమిత్ బర్దార్
నెల్లూరు ఎస్పీ- ఆరిఫ్ హఫీజ్