మాజీ మంత్రి, వైసీపీ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivasa Reddy) తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన పార్టీని వీడబోతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఆయన పార్టీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి(Vijaysai Reddy)ని కలవడం తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా.. ఈ భేటీపై బాలినేని స్పందించారు. విజయసాయిరెడ్డి తనను స్నేహపూరితంగా వచ్చి కలిశారని వెల్లడించారు.
తమ మధ్య రాజకీయ అంశాలు చర్చ జరగలేదన్నారు. ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు విజయసాయిరెడ్డికి అప్పగిస్తారన్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితులపై చర్చించామని తెలిపారు. పార్టీలో ప్రక్షాళన సీఎం జగన్ చేస్తారన్నారు. కష్టపడి పని చేసే వాలంటీర్లను విమర్శించడం కరెక్ట్ కాదన్నారు. నారా లోకేష్(Nara Lokesh) పాదయాత్రతో తమకు ఇబ్బంది లేదన్నారు. లోకేష్ పాదయాత్ర ఎక్కడా మేం ఆపలేదని బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivasa Reddy) వెల్లడించారు.