ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

0
Palnadu district

Palnadu district two killed in road accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అద్దంకి – నార్కట్ పల్లి జాతీయ రహదారిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రొంపిచర్ల సమీపంలో లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కనిగిరి పట్టణానికి చెందిన మల్లికార్జునరావు, ప్రసాద్‎గా గుర్తించినట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా.. తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here