వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) సర్వ శక్తులు ఒడుతున్నారు. ఇందులో భాగంగా జనసేన, బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. అలాటే అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి వ్యవహరించారు. సర్వేలు, సామాజికవర్గాల ప్రాతిపదికన సీట్లు కేటాయించారు. ఈ క్రమంలోనే కొంతమంది టీడీపీ(TDP) కీలక నేతలు, మాజీ మంత్రులకు సైతం సీట్లు గల్లంతయ్యాయి. ఈ నేపథ్యంలో సీట్లు దక్కని నేతల విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. టికెట్ రాని పలువురు సీనియర్ నేతలకు పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఇచ్చారు.
కొవ్వూరు టికెట్ ఆశించిన మాజీ మంత్రి కేఎస్ జవహర్‌కు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. అలాగే రెడ్డి సుబ్రమణ్యంను టీడీపీ పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. ఇక సీనియర్ నేత గండి బాబ్జీని విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించారు. హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా బీవీ రాముడు, టీడీపీ(TDP) పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా సీఎం సురేష్, మన్నె సుబ్బారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.