ఆలూరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు పాటిల్ నీరజారెడ్డి(Patil Neeraja Reddy) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారు వెనుక టైరు గద్వాల జిల్లా బీచుపల్లి దగ్గర పేలి ఒక్కసారి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో నీరాజారెడ్డి తీవ్రగాయాలపాలయ్యారు. ప్రమాదంలో నీరజారెడ్డి తల, ఇతర శరీర భాగాలకు తీవ్రగాయాలపాలయ్యారు. అంతేకాదు ప్రమాదం ధాటికి వాహనం నుజ్జు నుజ్జు అయ్యింది. దీంతో వెంటనే నీరజ రెడ్డిని కర్నూలులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇకపోతే 1996లో నీరజా రెడ్డి భర్త దారుణహత్యకు గురయ్యారు. అనంతరం నీరజారెడ్డి 2004లో పత్తికొండ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత 2009లో కాంగ్రెస్ టికెట్‌పై ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆమె విజయం సాధించారు. అనంతర కాలంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన నీరజా రెడ్డి(Patil Neeraja Reddy) ప్రస్తుతం ఆలూరు బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నారు.
Read Also: నాలుగు గంటలుగా కొనసాగుతున్న కేజ్రీవాల్ CBI విచారణ
Follow us on: Google News, Koo, Twitter