Pawan Kalyan – Tirumala Laddu | తిరుమల లడ్డూ ప్రసాద తయారీలో కల్తీ నెయ్యి వినియోగం ప్రస్తుతం సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా ఇదే చర్చనీయాంశంగా మారింది. అసలు టీటీడీలో వినియోగించిన నెయ్యిలో జంతువు కొవ్వు కలిసిందా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. చంద్రబాబు అనడమే తప్ప మరే ఇతర అధికారులు కానీ, టీటీడీ ఈవో కానీ ఈ విషయాన్ని క్లారిటీ చెప్పలేదు. కానీ దేశమంతా ఈ వివాదం గురించే చర్చిస్తోంది. ఈ క్రమంలోనే తిరుపతి ప్రసాద పవిత్రతను పునరుద్దరించామని, అన్ని నాణ్యమైనా ముడిసరుకులతో సిద్ధం చేసిన ప్రసాదాన్నే అందుబాటులో ఉంచామని టీటీడీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈరోజు మంగళగిరిలో టీటీడీ ఈఓ శ్యామలరావు(TTD EO Shyamala Rao).. జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా శ్యామల రావుకు పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారు.
వీరి సమావేశంలో లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై పవన్ కల్యాణ్ ఆరా తీశారు. గత పాలకమండలి హయాంలోనే కల్తీ నెయ్యి వినియోగం జరిగిందని, నెయ్యి నాణ్యతను గాలికి వదిలేస్తూ టెండర్లు ఓకే చేశారని వివరించారు ఈవో. టీటీడీ తరపున సంప్రోక్షణ చర్యల చేపట్టినట్లు తెలిపారు. కాగా ధార్మి అంశాల్లో రాజీ పడొద్దని, బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. భక్తుల మనోభావాలు, ఆచారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, వాటికి అవాంతరం కలిగించే విషయాల్ల కఠినంగా వ్యవహరించాలని ఈవో శ్యామలరావుకు తెలిపారు పవన్(Pawan Kalyan).