స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు ఆయనను .తనయుడు నారా లోకేష్(Nara Lokesh), బావమరిది బాలకృష్ణ(Balakrishna), జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో ములాఖత్ సమయంలో భేటీ అయ్యారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరి భేటీలో పొలిటికల్ అజెండా ఉందని అందరూ భావించారు. పొత్తులపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందంటూ ఊహాగానాలు వినిపించాయి. అందరూ భావించినట్టే భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి తో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు.
వైసీపీని ఎదుర్కొనేందుకు టిడిపి తో కలిసి ఎన్నికల్లోకి వెళ్తానని తేల్చి చెప్పారు. వైసిపి మరోసారి గెలిస్తే రాష్ట్రంలో కోలుకోదని, అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ఓడించాలని తాను నిర్ణయించుకున్నట్టు చెప్పారు. దీనికోసం టిడిపి తో కలిసి అడుగులు వేసేందుకు తాను సిద్ధమైనట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం బిజెపితో ఉన్న జనసేనాని(Pawan Kalyan) టిడిపి తో పొత్తు గురించి కమలం పెద్దలకు వివరిస్తానని తెలిపారు. బిజెపి మద్దతు సంపూర్ణంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.