టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఇద్దరూ సమావేశం అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అసెంబ్లీ సీట్ల సర్దుబాటు, ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిపారు. ఎంపీ స్థానాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకున్నా అసెంబ్లీ స్థానాల విషయంలోనే కొన్ని మార్పులు చేర్పులు కావాలని పవన్ అడుగుతున్నట్లు తెలుస్తోంది. కోస్తాలో ఒకటి, రాయలసీమలో ఒక సీటుని మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా మిగిలిన అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమయ్యారు.
మరోవైపు ప్రచారంలో కూడా ఎలా ముందుకెళ్లాలనే దానిపై ప్రణాళికలు రూపొందించారు. ఈ నెల 26 నుంచి ప్రజాగళం పేరుతో చంద్రబాబు(Chandrababu) ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ నెల 27 నుంచి పవన్(Pawan Kalyan).. వారాహి యాత్రను చేపట్టనున్నారు. అలాగే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు ఉమ్మడి మ్యానిఫెస్టో కూడా విడుదల చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అటు బీజేపీతో కూడా సమన్వయం చేసుకునేలా స్థానిక నేతలకు సూచనలు చేస్తున్నారు.