Pawan kalyan: నేను ఎంత సంపాదిస్తానో మీకు తెలుసారా వెధవల్లారా?

-

Pawan kalyan: నేను ఎంత సంపాదిస్తానో మీకు తెలుసారా వెధవల్లారా? అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార పార్టీ పై విరుచుకుపడ్డారు. అమరావతిలోని జనసేన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ఆదాయ వనరులు, పార్టీ ఫండ్స్, పన్నుల గురించి వివరణ ఇచ్చారు. ‘‘గత 8 ఏళ్లలో 6 సినిమాలు తీశాను. రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్లు సంపాదించా. రూ.33 కోట్ల పన్ను కట్టా. నా బిడ్డల భవిష్యత్ కోసం ఉంచిన FDల నుంచి పార్టీ ఫండ్ ఇచ్చా. హుద్ హుద్ నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ వరకు రూ.12 కోట్లు ఇచ్చా. అయోధ్య రామాలయానికి రూ.33 లక్షలు ఇచ్చా’’ అని వివరించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతానని హెచ్చరించారు. జనసేనకు సంబంధించిన ప్రతి లెక్కను తాను చెప్తానని అన్నారు. జనసేన ఐదు ఖాతాల్లో రూ. 15.58 లక్షలు కార్పస్ ఫండ్ ఉందని తెలిపారు. రైతు భరోసా కోసం రూ. 3.50 కోట్ల నిధులు జనసేన వద్ద ఉన్నాయనీ.. నన్ను ప్యాకేజీ స్టార్ అంటున్న వైసీపీ నేతలు ఇది గుర్తు పెట్టుకోని మాట్లాడాలన్నారు.

- Advertisement -

కులాన్ని కించపరిస్తే నాలుకలు కోస్తా
‘‘సీఎం జగన్ అడుగులకు మడుగులొత్తే వైసీపీ నాయకులు కులాన్ని కించపరిస్తే నాలుకలు కోస్తా. ఏమయ్యా కొట్టు సత్యనారాయణ కొట్టులో కూర్చో. నా రాజకీయం ఏంటో చూపిస్తా చూడు. వైసీపీలో వెధవ వాగుడు వాగే కాపు ఎమ్మెల్యే లందరికీ చెబుతున్నా, పిచ్చపిచ్చ వాగుడు వాగకండి. కులాల పేరు పెట్టి విమర్శలు చేయడం సభ్యతా?. కులం మీ వెంట రాదురా సన్నాసుల్లారా అది గుర్తుంచుకోండి’’ అని (Pawan kalyan) ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీరు కూడా 3 పెళ్లిళ్లు చేసుకోండ్రా..
నా పెళ్లిళ్లపై విమర్శించే వారికి చెబుతున్న మీరు కూడా 3 పెళ్లిళ్లు చేసుకోండ్రా. మొదటి భార్యకు మీకూ వర్కౌట్ కాకుంటే విడాకులు ఇవ్వండిరా..! నేను మొదటి భార్యకు రూ.5కోట్ల డబ్బిచ్చి, రెండో భార్యకు మిగతా ఆస్తిచ్చి విడాకులు తీసుకున్నారా సన్నాసుల్లారా. ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 స్టెపినీలతో తిరిగే సన్నాసుల్లారా.. మీకేంట్రా నేను చెప్పేది. వెధవల్లారా’’ అని మండిపడ్డారు.

వైసీపీతో నేను యుద్ధానికి సిద్దం
వైసీపీతో నేను యుద్ధానికి సిద్దం. రాడ్లతో వస్తారా.. లేక హాకీ స్టిక్కులతో వస్తారా.. దేనికైన నేను సై రండి తేల్చుకుందాం.​ ఇప్పటి వరకు నా సహనం చూశారు. ఇవాళ్టి నుంచి యుద్ధమే.. మీరు రెడీనా. వైసీపీ నాయకులు అంతా నీచులని నేను అనడం లేదు. కానీ వైసీపీలో నీచుల సమూహం ఎక్కువైంది.’’ అని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...