అంగన్‌వాడీలను ప్రభుత్వం విధుల్లో నుంచి తొలగించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “నలభై రోజుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పట్ల ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరి ప్రజాస్వామ్యయుతంగా లేదు. వారితో సామరస్యపూర్వకంగా చర్చలు జరపకుండా విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం, పోలీసు చర్యలకు దిగటం సరైన పద్ధతి కాదు. ముఖ్యమంత్రి జగన్‌కు కోటి సంతకాలతో వినతి పత్రం ఇచ్చేందుకు ‘చలో విజయవాడ’ కార్యక్రమం చేపడితే అర్ధరాత్రి వేళ పోలీసులు వారిని ఈడ్చి వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను” అని తెలిపారు.
‘‘అంగన్‌వాడీ(Anganwadi) సిబ్బందిని అరెస్టు చేయడం వారి కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోంది. విజయవాడలో వారిని అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బందిపైనా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. సీఎం జగన్(CM Jagan) ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేస్తూ పొరుగు రాష్ట్రాల కంటే ఎక్కువ జీతం ఇస్తాను అని హామీ ఇచ్చారు. దాన్నే అమలు చేయాలని కోరుతున్నారు. అలాగే సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యూటీ వర్తింప జేయమంటున్నారు. చిన్నపాటి జీతాలతో పని చేస్తున్న వారిపట్ల సానుకూల దృక్పథంతో ఆలోచించాలని కోరుతున్నాం. అంగన్‌వాడీలపై పాలకపక్షానికి చెందిన సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి’’ అని Pawan Kalyan బహిరంగ లేఖ విడుదల చేశారు.
Read Also: అయోధ్యకు రాముడు తిరిగొచ్చాడు.. ప్రధాని మోదీ భావోద్వేగ ప్రసంగం..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat