బర్డ్ ఫ్లూ(Bird Flu), గులియన్ బారీ సిండ్రోమ్(GBS) రెండు తెలంగాణ ప్రజలకు తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కాగా ఈ విషయాలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్(Minister Satya Kumar) వ్యాఖ్యానించారు. వీటిపై ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తోందని, వ్యాక్సిన్ల కోసం ఇండెంట్ పెట్టామని చెప్పారు. రాష్ట్రంలో పలువురు ప్రజలు బర్డ్‌ఫ్లూ బారిన పడ్డారన్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రంలో బర్డ్ ప్లూ, గిలియన్ బార్ సిండ్రోమ్ వ్యాధుల వ్యాప్తి అదుపులో ఉంది. దీనిపై ఎవరూ ఆందోళనకు గురి కావొద్దు. ఎక్కడ బర్డ్ ప్లూ మనుషులకు సోకలేదు. గిలియాన్ బార్ సిండ్రోమ్ వ్యాధికి అవసరమైన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి’’ అని చెప్పారు.
‘‘మరిన్ని వ్యాక్సిన్ ల కోసం ఇండెంట్ పెట్టాం. రాష్ట్రంలో కూటమి పార్టీ(Alliance Parties) ల మధ్య ఎటువంటి గ్యాప్ లేదు. అనవసరంగా కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు. ధర్మవరంలో కూడా మా మధ్య ఎటువంటి గ్యాప్ లేదు. క్షేత్రస్థాయిలో చిన్న చిన్న విబేధాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఇంకా అరెస్టులు పూర్తిస్థాయిలో జరగలేదు. జగన్(YS Jagan) హయాంలో అనేక మందిని అరెస్ట్ లు చేశారు. అన్ని చట్ట ప్రకారం జరుగుతాయి’’ అని స్పష్టం మంత్రి(Minister Satya Kumar) చేశారు.