ఇక రాజకీయాలకు సెలవు.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

-

మచిలీపట్నం(Machilipatnam) ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్నినాని(Perni Nani) సంచలన వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నంలో సీఎం జగన్ బందర్ పోర్టు ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పేర్ని మాట్లాడుతూ మరోసారి జగన్ తో వేదిక పంచుకునే అవకాశం వస్తుందో రాదో అని తెలిపారు. బహుశా ఆయనతో ఇదే నా చివరి మీటింగ్ కావచ్చు అని వ్యాఖ్యానించారు. వేదికపై చాలా సేపు మాట్లాడిన ఆయనను మిగతా నేతలు సమయం లేదు ప్రసంగం ఆపాలని విజ్ఞప్తి చేసినా పేర్ని(Perni Nani) పట్టించుకోలేదు. తనకు జగన్(Jagan) తో ఇదే చివరి మీటింగ్ కావచ్చని, ప్రసంగం ఆపనని పేర్కొన్నారు. వయస్సులో జగన్ చిన్నవాడు అయిపోయారు.. లేదంటే పాదాభివందనం చేసే వాడినని తెలిపారు. తన కుమారుడు రాజకీయ భవిష్యత్ కోసమే ఆయన రిటైర్మెంట్ ప్రకటించినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -
Read Also: బిగ్ బ్రేకింగ్: సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...