PM Modi Vizag Tour Updates దేశంలో ప్రముఖ నగరం విశాఖపట్టణం అని వ్యాపారం సమృద్ధిగా సాగే పట్టణం అని మోడీ అన్నారు. ప్రాచీన భారతంలో విశాఖ మంచి పోర్టుని 1000 ఏళ్ళ క్రితం వరకూ పశ్చిమాసియా రోమ్ నుంచి ఇక్కడికి వ్యాపారులు వచ్చేవారని.. భారత వ్యాపార కేంద్రానికి విశాఖ కేంద్రంఅని కొనియాడారు. శనివారం ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘ఏపీ ప్రజల ప్రేమ అపురూపం ఏపీ ప్రజలకు ప్రత్యేకత వుంది. ప్రపంచంలో అనేక దేశాల్లో ఏపీ వారు తమ ప్రతిభను కనబరుస్తున్నారు. విద్య, వైద్యం, టెక్నాలజీ రంగాల్లో ఏపీకి చెందినవారు ఎంతో మంది ఉన్నారు. తెలుగు భాష ఎంతో ఉన్నతమయింది. తెలుగు ప్రజలు అందరి బాగు కోసం వెతుకుతుంటారు.’’ ప్రధాని అని కొనియాడారు.
- Advertisement -