Pothina Mahesh | జనసేన పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. పోతిన మహేష్ రాజీనామా..

-

ఎన్నికల వేళ జనసేన పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న పోతిన మహేష్(Pothina Mahesh) పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను అధినేత పవన్ కల్యాణ్‌కు పంపించారు. పార్టీలో తాను నిర్వహిస్తున్న పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు తనకు సహకరించిన జనసేన పార్టీ నాయకులకు, వీరమహిళలకు, జన సైనికులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. దీంతో విజయవాడలో జనసేనకు కొంత దెబ్బ తగిలినట్లైంది.

- Advertisement -

కాగా పోతిన మహేష్ పార్టీ ఆవిర్భావం నుంచి జనసేనలోనే కొనసాగుతున్నారు. పార్టీ తరఫున తన వాయిస్ బలంగా వినిపించేవారు. ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. అయితే ఈసారి ఎన్నికల్లో తిరిగి తనకు టికెట్ దక్కుతుందని ఆశించారు. కానీ పొత్తులో భాగంగా బీజేపీకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కేటాయించారు. ఇక్కడి నుంచి బీజేపీ సీనియర్ నేత సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన మహేష్(Pothina Mahesh) పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.

Read Also:  కవితకు దక్కని ఊరట.. మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేత..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala | తిరుమలలో భారీ వర్షం.. సేదతీరిన భక్తులు..

తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం...

Dande Vital | బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...