తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులు ఘనంగా పవిత్రమైన రంజాన్(Ramadan) పండుగను జరుకుంటున్నారు. భారీ సంఖ్యలో మసీదులు, ఈద్గాలలో ప్రార్థనలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలోని ప్రార్థనా మందిరాలన్ని ముస్లిం సోదరులతో నిండిపోయాయి. ఒకరినొకరు అలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. రంజాన్ సందర్భంగా రెండు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యంత్రులు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రంజాన్ పండుగ ముస్లిం సోదరుల ఇంట సుఖసంతోషాలు నింపాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. నెలరోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేసిన ముస్లింలు శుక్రవారం రాత్రి నెలవంక కనిపించడంతో నేడు రంజాన్ పండుగను జరుపుకుంటున్నారు.
Read Also: అక్కినేని వారసుడిగా ఉండలేను.. అఖిల్ సంచలన వ్యాఖ్యలు
Follow us on: Google News, Koo, Twitter