ప్రజల దృష్టిని మరల్చడానికి వేసిన ప్లానే ఇది: టీడీపీ ఎంపీ

-

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్షలో భాగంగానే మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు(Adireddy Apparao)తో పాటు ఆయన తనయుడు, ఆదిరెడ్డి శ్రీనివాస్‌‌లను ఏపీ సీఐడీ అరెస్ట్‌ చేసిందని ఆరోపించారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్‌ను మంగళవారం రామ్మోహన్ నాయుడు పరామర్శించారు. త్వరలో జరగబోయే మహనాడు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు తప్పుడు కేసులతో అలజడి సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మెడకు వివేకా హత్య కేసు(Viveka Murder Case) చుట్టుకుంటోంది. రాష్ట్ర ప్రజలు అంతా వాస్తవాలను తెలుసుకుంటున్నారు.. ఈ సమయంలో ప్రజల దృష్టిని మరల్చడానికి వేసిన ప్లాన్‌లో భాగమే అంటూ రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) కీలక వ్యాఖ్యలు చేశాడు. జగన్ ప్రభుత్వం ప్రతిపక్షాలను అణగదొక్కి పెత్తనం చెలాయించే దిశగా అడుగులు వేస్తోందని అన్నారు.

- Advertisement -
Read Also: మహిళల మానసిక ఒత్తిడి తగ్గించే 3 సులువైన చిట్కాలు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...